పాలకీడు కేకే మీడియా జనవరి 20
సాగర్ నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ సాగర్ నీరు రాక భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లలో నీరు లేక బావుల్లో నీరు లేక వేసిన పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని ఆయన అన్నారు ముఖ్యంగా జాన్పాడు మేజర్ కింద రైతు వేసిన పంట పొలాలు ఎండిపోయే దశలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మన స్థానిక ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నందున రైతాంగ యొక్క సమస్యలు అర్థం చేసుకొని సాగర్ నీటిని విడుదల చేసి పంటలు కాపాడే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పగడాల మట్టేష్ మాజీ సర్పంచు సుంకరి క్రాంతి కుమార్ మాజీ సర్పంచ్ రైతు సంఘం నాయకులు గుర్రం ధనమూర్తి కొప్పు రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు