సాగర్ నీటితో చెరువులు కుంటలు నింపాలి.
కేకే మీడియా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల
భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో సాగర్ ఎడమ కాల ద్వారా పాలేరు రిజర్వాయర్కు మంచినీటి అవసరాల కోసం ప్రభుత్వం నీటిని తరలిస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, పాలకీడు, మండలాల లోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి మంచినీటి సమస్య విలయతాండవం చేస్తుందని జిల్లా నుంచే నీళ్లు పాలేరుకు వెళ్తున్న ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రభుత్వం అధికారం యంత్రాంగం వెంటనే స్పందించి ప్రజల దాహర్తిని తీర్చేందుకు కనీస అవసరాలకు నీటి వినియోగం చేసుకునేందుకు వీలుగా భూగర్భ జలాలు పెరిగేందుకు ఆయా గ్రామాల్లోని చెరువులు కుంటలు నింపాలని మాజీ సర్పంచ్ , క్రాంతిని కేతన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సుంకర క్రాంతి కుమార్ కోరారు