నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 28
సాగర్ ఎడమ కాలువ కు సాగు, త్రాగు నీటిని వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పారేపల్లి శేఖర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. నేరేడుచర్ల లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్లో సుమారు 1,50,000 ఎకరాల భూమి వరి నాట్లు వేశారని, అవి బోర్లు, బావుల ద్వారా రైతులు నాటు వేయడం జరిగిందని, ప్రస్తుత తరుణంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు బావులు ఎండిపోయాయని తీరా పంట చేతికి వచ్చే దశలో పొలాలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం రైతన్నల మీద కనికరం చూపి వెంటనే సాగర్ ఎడమ కాలువకు 15 రోజులపాటు నీరు వదిలి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడి రైతులను ఆదుకోవాలన్నారు. పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రానున్న కాలంలో తాగునీరు కి ఎద్దడి వచ్చి ప్రజలకు పశువులకు త్రాగే నీరు దొరికే పరిస్థితి ఉండదన్నారు. సాగర్ ఎడమ కాలువ 15 రోజులు వదిలితే భూగర్భ జలాలను కాపాడుకోవచ్చని కనీసం తాగునీటి ఎద్దడి లేకుండా చూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కోదమగుండ్ల నగేష్, కందగట్ల అనంత ప్రకాష్, ఎడ్ల సైదులు, కుంకు తిరుపతయ్య, మొగిలిచర్ల రుద్రమ్మ, నీలా రామ్మూర్తి, శీను తదితరులు పాల్గొన్నారు.