నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 16
సాగర్ ఆయకట్టు ప్రాంతమైన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు సాగర్ ఆయకట్టు నుండి విడతల వారీగా సాగు నీరు అందించి మత్స్య సంపదను, ఆరుతడి ,ఇతర పంటలను కాపాడాలని సూర్యాపేట జిల్లా మత్స్య సహకార సంఘ ప్రమోటర్ పేరబోయిన వీరయ్య ముదిరాజ్ , రైతు సంఘం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ , మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొనతం సత్యనారాయణరెడ్డి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు నేరేడుచర్ల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ లో సరైన వర్షాలు లేక చెరువులలో నీటి సమస్య ఉన్న సమయంలో గత ప్రభుత్వం చెరువులు నింపేందుకు, పంటలను దక్కించుకునేందుకు విడతల వారీగా నీరంధించి ఆదుకున్నారని గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అనేక గ్రామాల్లోని ఊర చెరువులకు మత్స్య సహకార సంఘం ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడంతో పాటు స్వతహాగా కొనుగోలు చేసిన చేప పిల్లలు వేసి దాని మీద ఆధారపడి జీవించే వందలాది మచ్చకార కుటుంబాలు మరో మూడు నెలలు చెరువుల్లో నీళ్లు సమృద్ధిగా ఉంటే చేప సంపద దక్కే అవకాశం ఉందని ఇప్పటికే అడుగంటుతున్న నీటి తో చేపలు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. ఖరీఫ్లో నీరు లేక కనీసం రబీలోనైనా ఆరుతడి పంటలు దక్కించుకుందామని వేసుకున్న రైతులు వర్షాలు లేక బోర్లలో , చెరువుల్లో నీటి నిల్వలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతుల కష్టాలు గమనించి ప్రభుత్వం విడతల వారీగా నీటి విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.