నేరేడుచర్ల కేకే మీడియా
డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు సోమవారం నేరేడుచర్ల, పెంచికల్ దిన్నె, చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ప్రత్యేక మహాజన సర్వసభ్య సమావేశాలను నిర్వహించారు. సమావేశంలో రైతుబంధు పథకం గురించి సలహాలు సూచనలు తీసుకున్నారు. రైతుల సలహాలు, సూచనలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి వాటిని ఉన్నత అధికారులకు పంపనున్నారు. ఈ సమావేశానికి హుజూర్నగర్ సహాయ వ్యవసాయ సంచాలకుడు, మండల వ్యవసాయ అధికారి, ఏ ఈ ఓ లు, సహకార సంఘాల డైరెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.