నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 2:
నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న సర్వేనెంబర్ 414 లోని ప్రభుత్వ భూమి ఏ 1.05 గుంటల భూమి అన్యాక్రాంతమైందని. ఆ భూమిని సర్వే చేసి ప్రభుత్వ ప్రయోజనాలకు ఉపయోగించాలని కోరుతూ నేరేడుచర్ల కు చెందిన బెల్లంకొండ శేకర్ మండల రెవెన్యూ అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
గురువారం నాడు మండల రెవెన్యూ అధికారి కి సర్వే నెంబర్ 414లో గల ప్రభుత్వ భూమి పూర్తి విస్తీర్ణం ఏ 3.12 గుంటలు ఉండగా అందులోని ఏ 2.07 గుంటల భూమి అన్ సైన్డ్ కాగా మిగిలి ఉన్న ఏ 1.05 కుంటల భూమిని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు గుర్తించినప్పటికీ దానిని స్వాధీన పరచుకోకపోవడంతో అన్యాక్రాంతమవుతుందని అట్టి భూమిని వెంటనే స్వాధీన పరుచుకొని ప్రభుత్వ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల తాసిల్దార్ కు అత్యవసర ఫిర్యాదును అందజేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను ఆర్డీవో కు మరియు సూర్యపేట జిల్లా కలెక్టర్ వారికి సిసిఎల్ఏ హైదరాబాద్ వారికి ధర్మ పీఠానికి రిస్టరీ పోస్టులు చేసినట్లు తెలిపారు.