సమగ్ర యువజన విధానాన్ని ప్రకటించాలి: ఏఐవైఎఫ్
నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము సమగ్ర యువజన విధానాన్ని ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను కోరారు.నేరేడుచర్ల మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ నూతన సంవత్సర కాలమానిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత ప్రభుత్వం యువకులను అన్ని విధాల మోసం చేసిందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువకులంతా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులకు అర్హత మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నైపుణ్యం కలిగిన యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
కార్యక్రమంలో బి. పావని, పి కావేరి, ఏ కీర్తన, వై. సాయి, ఎస్కే జానీ పాషా, బి.అనిల్, ఎస్.వేణు, టి. నరేష్ సాయికుమార్, పవన్ తదితరులు పాల్గొన్నారు.