మిర్యాలగూడ కేకే మీడియా నవంబర్ 3
మిర్యాలగూడ మండలంలోని వివిధ గ్రామాల్లో సమగ్రాభివృది కోసం మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ప్రజలను కోరారు.శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని వాటర్ ట్యాంక్ తండ, భాగ్య తండ, చిల్లాపురం, కుంటకింది తండ, ఐలాపురం, కుర్యాతండ, టిక్యా తండ, జంకు తండ, వెంకటాద్రిపాలెం, శ్రీనివాసనగర్, దుబ్బతండ తదితర గ్రామాల్లో ప్రగతియాత్ర జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు గారు మాట్లాడుతు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని, ఆసరా పెన్షన్, రైతు బంధు లబ్ధి దశలవారీగా పెంపుదల చేస్తామన్నారు. ప్రతీ ఇంటికి కెసిఆర్ బీమా అందిస్తామని వివరించారు.
గత పదేళ్ళలో గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం కెసిఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. శ్రీనివాసనగర్ గ్రామ పంచాయితీ రాష్ట్రస్థాయి లోనే గాక దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, దీనికి మనమందరం గర్వపడుతున్నామని చెప్పారు. అధికారంలోకి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి గెలిపించాలని, సీఎం కేసీఆర్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, దీని కోసం ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు.