నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 7
నిరంతరాయ కరెంటు రైతులకు అందించాలంటూ రైతులు సోమవారం నాడు ఉదయం సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు.
సింగారం ఎల్లాపురం పాలకీడు ఇతర గ్రామాల రైతులు నార్లు పోసుకొని నాట్లు వేసుకుని బోర్లు బావుల పై ఆధారపడి కరెంటు ఉంటుందన్న నమ్మకంతో చేసే వ్యవసాయ పనులకు అంతరాయం కలిగిస్తూ కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడంతో నార్లు ఎండిపోతు నాటేసిన పొలాలు ఎండిపోతుండడంతో రైతులు దర్శించర్ల లోని సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు
నిరంతరాయమైన నాణ్యమైన త్రీఫేస్ కరెంటును అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు