హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 10
హుజూర్నగర్ బరిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా తన సత్తా చాటేందుకు సింహం గుర్తుపై పోటీకి దిగాడు పిల్లుట్ల రఘు
హుజూర్నగర్ నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాలుగా ఓజొ ఫౌండేషన్ పేరుతో హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలలో ముందుంటూ యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇస్తూ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజలకు చేరువై ప్రధాన పార్టీల నుండి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పోటీపడినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసి నామినేషన్ల పర్వం చివరి రోజు అయిన నవంబర్ 10 నాడు అశేష అభిమానుల నడుమ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ ద్వారా స్వతహాగా ఎన్నో కార్యక్రమాలు చేసిన నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత సేవ చేస్తానన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు మహిళలకు స్వశక్తితో ఎదిగేందుకు కావలసిన స్కిల్ కార్యక్రమాలు శిక్షణను ఇప్పించి స్వయంగా ఉపాధి పొందేలా చేస్తానని ప్రతి రైతుకు అందుబాటులో అవసరమైన కార్యక్రమాలు అందించగలనని అన్నారు.