నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 16
షీ టీం , సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మండలంలోని జూనియర్ కళాశాలల విద్యార్థినులకు స్థానిక శ్రీవాణి పాఠశాల ఆవరణలో బుధవారం నాడు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీం ఆధ్వర్యంలో నేరేడుచర్ల పోలీసు అధికారులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నేరేడుచర్ల ఎస్సై పి పరమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆడపిల్లల, మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు తీసుకువచ్చిందని అందులో భాగంగానే షీ టీం లో ఏర్పాటు చేయడం జరిగిందని సమాజంలో జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు పోలీసు శాఖ నుంచి సత్వర సహకారం అందించేందుకు 100 డయల్, భరోసా సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఎంతగానో ఉపయోగపడుతుందనీ. అత్యవసర ఆపద సమయాల్లో ఈ నెంబర్లను వినియోగించుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో, ఓటిపి అడుగుతూ వచ్చే సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే అనర్ధాలు వివరిస్తూ విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్త వహించాలని భవిష్యత్తు అంధకారం కాకుండా చట్టాల పట్ల అవగాహన కలిగి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని హితవు పలికారు.
కార్యక్రమంలో మొదట పోలీసు కళాబృందం చే విద్యార్థులకు అవగాహన కల్పించే పాటలను పాడి అలరించారు.
ఈ కార్యక్రమములో సూర్యాపేట షీ టీం హెడ్ కానిస్టేబుల్ జాఫర్ , భరోసా సెంటర్ మౌనిక , కిరణ్మయి , పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ రవీందర్ శ్రీవాణి హై స్కూల్ ప్రిన్సిపల్ సీతారాం రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవి స్పందన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య,చారి, కృష్ణ,నాగార్జున, విద్యార్థి, విద్యార్థినిలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*