అంగవైకల్య బాలుడికి లయన్స్ చేయూత
నేరేడుచర్ల కేకే మీడియా అక్టోబర్ 13:
నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుట్టుకతో మూగ, చెవిటి అంగవైకల్యం గల కార్తీక్ కు ఆపరేషన్ చేయించి లయన్స్ క్లబ్
ఆదర్శంగా నిలిచింది.
నేరేడుచర్ల కు చెందిన పేదరికంలో ఉన్న గుండు గురుమూర్తి , కృష్ణవేణి దంపతుల పుత్రుడు కార్తీక్ కు చిన్నతనంలోనే మూగ, చెవిటి అంగవైకల్యంతో బాధపడుతుండగా వారు కడు పేద కుటుంబం వారు కావడం తో లైన్స్ క్లబ్ వారిని సంప్రదించగా నేరేడుచర్ల లయన్స్ క్లబ్ వారు హైదరాబాదులోని శ్రీ రావుస్ జూబ్లీహిల్స్ ఈఎన్టి హాస్పిటల్ వారిని సంప్రదించగా ఆరు నెలల్లో మూడు ఆపరేషన్లు చేయవలసి ఉన్నదని దానికి అంగీకరిస్తే హాస్పిటల్ వారు ఆపరేషన్ మూడుసార్లు ఆపరేషన్ చేసి చెవులో కాక్టైల్స్ ఇంప్లాంట్స్ అమర్చారు ఈ ఆపరేషన్లకు సుమారుగా 18 లక్షలు ఖర్చు అవుతుండగా లైన్స్ క్లబ్ వారు సంప్రదించి వారిని ఒప్పించి ఆ డబ్బు మొత్తాన్ని శ్రీ రావుస్ హాస్పిటల్ యాజమాన్యం ముఖ్యంగా డాక్టర్ సిరి యొక్క సహాయంతో కార్తీక్ ఆపరేషన్ చేయించడం లో సహాయం అందించినందుకు హాస్పటల్ వారికి నేరేడుచర్ల లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆరు నెలల కాలంలో ఈ పేద కుటుంబానికి కార్తీక్ ఆపరేషన్కు టెస్టుల కోసం మరియు ఆపరేషన్ తర్వాత వారి ఖర్చుల నిమిత్తం లైన్స్ క్లబ్ నేరేడుచర్ల వారి సహకారంతో మొత్తం 30 వేల రూపాయలను ఆ పేద కుటుంబానికి సేకరించి ఆదివారం వారికి అందజేశారు.
కార్తీక్ చెవిటి మూగ ఆపరేషన్ సక్సెస్ అయి అతనికి మంచి జీవితం దేవుడు ప్రసాదించాలని లైన్స్ క్లబ్ తరఫున ప్రార్థిస్తు లైన్స్ క్లబ్ ఇటువంటి పేద వర్గాల ఆరోగ్యం కుటుంబాలకు తమ దృష్టికి వస్తే కచ్చితంగా ఇటువంటి సేవలను నేరేడుచర్ల లైన్స్ క్లబ్ అందిస్తుందని క్లబ్ అధ్యక్షులు జిలకర రామస్వామి క్లబ్ జోన్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి మాజీ జోన్ చైర్మన్ ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి తెలియజేశారు .
ఇక ముందు కూడా కార్తీక్కు ఆరోగ్యానికి తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు క్రాంతి కుమార్ క్లబ్ ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ కోశాధికారి ఎస్కే యూసుఫ్ క్లబ్ సభ్యులు కీత కనకయ్య ఉప్పాల లక్ష్మారెడ్డి బోనగిరి అంజయ్య చిలక రాజు శ్రీను కార్తీక్ తల్లిదండ్రులు కొనతం రామనరసింహారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు