కేకే మీడియా శ్రీశైలం ఆగస్టు 27
శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు.కాగా మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి డ్యామ్ నీటిమట్టం 884 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం
210.0320 టీఎంసీలుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,34,310 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,065 క్యూసెక్కులు, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 22,080 క్యూసెక్కులు మొత్తంగా 1,67,655 క్యూసెక్కుల వరద నీరొచ్చి శ్రీశైల జలాశయానికి చేరింది. కుడి,ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు
68,998 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.