గరిడేపల్లి కేకే మీడియా నవంబర్ 5
*హుజూర్నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ చల్లా శ్రీలతా రెడ్డి గెలుపు బాధ్యత నియోజకవర్గ మహిళా సోదరీమణులదేనని భాజాపా సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని కితవారి గూడెం గ్రామంలో మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కీత శ్రుతి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నీతి నిజాయితీకి నిలువుటద్దంలా నిలిచి, కల్మషం లేని మంచి హృదయమున్న మన ఇంటి ఆడపడుచు, ప్రజాసేవే లక్ష్యంగా రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగడం మన అదృష్టమన్నారు. ఇన్నేళ్లుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డిల పాలన భూ కబ్జాలు, దందాలు, దోపిడీలు, ఇసుక మాఫియాలు, పేకాట క్లబ్బులు, బ్రోకర్ల పైరవీలతో, అక్రమ కేసులతో, సామాన్య జనాన్ని దోచుకుని భయంకరమైన ఇబ్బందులకు గురిచేసినటువంటి పాలన మన కళ్ళ ముందు కదులుతుందని ఇందుకు భిన్నంగా మహిళా మణులకు సాదర గౌరవంతో, కలుపుగోలు తనంతో, అరమరికలు లేని నిజాయితీ పాలన ఈ సోదరి తోనే సాధ్యమన్నారు. దేశం – ధర్మం కొరకు నీత్యం పరితపించే భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఆమె గెలుపుకు అహర్నిశలు శ్రమిస్తారని ఇందులో మహిళల పాత్ర అభేధ్యమైనటువంటిదన్నారు. నిత్యం ఇంటింటికీ మోడీ సంక్షేమాలను వివరిస్తూ సాగడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్సింగ్ నాగ సైదులు, బూత్ అధ్యక్షులు నర్సింగ్ వినయ్, కిత రమేష్, పల్లవి, వెంకన్న తదితరులున్నారు.*