నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 14
శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని నేరేడుచర్ల ఎస్సై పరమేష్ సూచించారు.
గురువారం నాడు నేరేడుచర్ల మండల పరిధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయబోవు మండపాల కమిటీ సభ్యులతోపాటు అఖిలపక్ష రాజకీయ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను మీ మీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటుచేసిన లింకులో దరఖాస్తు చేసుకొని అట్టి దరఖాస్తును స్థానిక పోలీస్ స్టేషన్లో సమర్పించాలని కోరారు.
పోలీస్ నిబంధనలు అతిక్రమించి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు