హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 1
తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు రాజకీయ పదవుల్లో మళ్లీ నిరాశ ఎదురైంది. 2014 ఎన్నికలు హుజూర్నగర్ నియోజకవర్గం అసెంబ్లీ సీట్ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత హుజూర్నగర్ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్న క్రమంలోనూ 2018 ఎన్నికల్లో తిరిగి అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశకులోనైనా శంకరమ్మ అధిష్టానాన్ని వేడుకోగా సముచిత స్థానం కల్పిస్తాం సంయమనం పాటించాలని కోరడంతో అప్పటినుండి ఇప్పటివరకు అధిష్టానం ఏదో ఒక పదవి ఇస్తుందని ఆశగా ఎదురుచూసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వకపోగా కనీసం అమరుడి తల్లిగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొన్నిచోట్ల మనసులో మాట బయటపెట్టిన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సందర్భంలో అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం సందర్భంగా అమరవీరుల తల్లిదండ్రులకు ప్రోటోకాల్ వాహనాలు సెక్యూరిటీ కల్పించి తీసుకువెళ్లిన సందర్భంలో ఎమ్మెల్సీ పదవి ఖాయమని అందరూ భావిస్తున్న వేళ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వగానే అవకాశం కల్పిస్తామని కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు లతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
తను కూడా ఎప్పటికప్పుడు మంత్రులను కలుస్తూ తనకు అవకాశం కల్పించాలని విన్నపం చేసినప్పటికీ
ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోగా గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న రెండు స్థానాల్లో పార్టీ మారి వచ్చిన దాసోజు శ్రావణ్ , కుర్ర లకు అవకాశం కల్పించడంతో శంకరమ్మకు మళ్ళీ నిరాశ ఎదురయింది.