హైదరాబాద్ కే కే మీడియా ఫిబ్రవరి 21
తెలంగాణ ఉద్యమంలో అసువులు పాసిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఎమ్మెల్సీ అవకాశాలు పక్కనుందని విశ్వసనీయ సమాసం.
హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శంకరమ్మ కు తిరిగి 2018 ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని ఎదురుచూసిన ఎన్నారై గా వచ్చిన శానంపూడి సైదిరెడ్డి అవకాశం కల్పించడంతో అధిష్టానం ద్వారా భవిష్యత్తులో సముచిత స్థానం ఇస్తానని పెద్దలు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సర్దుబాట్లు చేసిన కేసిఆర్ శంకరమ్మ కు ఎలాంటి అవకాశం కల్పించకపోవడంతో పదేపదే పార్టీ పెద్దలను కలుస్తూ తనకు అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు మార్చిలో కాళీ అవనున్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి శంకరమ్మ పేరును ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఉద్యమకారులను విస్మరిస్తున్నాడు అన్న అపవాదు తొలగించుకునేందుకు ఒక్కో పదవులు ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తూ వస్తున్న తరుణంలో మొదటి తెలంగాణ ఉద్యమకారుడుగా ఉద్యమ అమరుడు గా పేరు ఉన్న శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తే ఆమెకి ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు అవుతుందని అమరవీరు త్యాగాలకు ప్రతిఫలంగా ఈ సీటు అందించామని రాజకీయ కోణంలో చెప్పుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం
ఎన్నాళ్ళ నుంచో తండ్రి లాంటి కెసిఆర్ కచ్చితంగా నాకు అవకాశాలు కల్పిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న శంకరమ్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కాలని వారి అభిమానులు కోరుతున్నారు