హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 26
ఎప్పుడు వివాదాస్పద సినిమాలు చేస్తూ నిజ జీవితంలో వివాదాస్పదంగా ప్రవర్తిస్తూ సంచలనంగా ఉండే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ రాజకీయంగా చంద్రబాబు కుటుంబంపై , తెలుగుదేశం పార్టీపై సినిమాల రూపంలో తమ అక్కసును వెల్లపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా మరో సినిమా వ్యూహం తెరపైకి తీసుకువచ్చాడు.
తను రాజకీయ నాయకుడిని కాదని వారితో నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెబుతూనే చంద్రబాబును లోకేష్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే రీతిలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే కథనాలతో సినిమాలు రూపొందించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తన అభిమానాన్ని చాటుతూ వస్తున్నాడు.
ప్రస్తుతం వ్యూహం పేరుతో తీసిన సినిమా తమ పార్టీ నాయకులకు కించపరిచే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇప్పటికే న్యాయస్థానాల్లో ఆశ్రయించారు. సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వచ్చిన, పలు వినతులు తెలుగుదేశం పార్టీ అభిమానుల నుండి చంద్రబాబు లోకేష్ అభిమానుల నుండి సినిమా నిర్మాతల మండలకి దర్శక మండల కి ఫిర్యాదుల అందిన వ్యూహం సినిమా రిలీజ్ ను ఎవరు ఆపలేరని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, లోకేష్ ల (సినిమా) ఫోటోలతో కూడిన అభ్యంతరకర పోస్టర్లు ట్విట్టర్ల , X ద్వారా ప్రసారమాధ్యమాల్లో రిలీజ్ చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో తెలంగాణలో తెలుగుదేశం అభిమానులు రాంగోపాల్ వర్మ బస చేస్తున్న ప్రాంతానికి వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సినిమాను ఆపాలని , అభ్యంతరకర అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడని ఇలాంటి సినిమాల వల్ల మా నాయకులనీ కించపరిచేలా చిత్రంలో చూపిస్తూ ఇబ్బంది పెడుతున్న రాంగోపాల్ వర్మ అని, దానిని కొనుగోలు చేసి ప్రదర్శించే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తగిన రీతిలో బుద్ధి చెబుతామని తెలుగుదేశం అభిమానులు హెచ్చరిస్తున్నారు.
కోర్టు పరిధిలో, ఉన్న వ్యూహం సినిమా విడుదల ఏ నిర్ణయం జరుగుతుందో వేచి చూడాలి మరి.
వ్యూహం సినిమాతో మరో మారు తెలుగుదేశంపై తన అక్కసు వెల్లగక్కిన.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ
RELATED ARTICLES