మిర్యాలగూడ కేకే మీడియా డిసెంబర్ 27
మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గుండెపోటుతో నిన్న రాత్రి 12 గంటలకు ఆకస్మిక మృతి బాధాకరమని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు లు అన్నారు.
మంగళవారం రాత్రి కుర్ర విష్ణు మృతి చెందడంతో బుధవారం నాడు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడుతూ మంచి ప్రజాసేవకుడు మంచికి మారుపేరు కుర్ర విష్ణు అని కొనియాడారు. అర్ధాంతరంగా అకాల మరణం చెందిన విష్ణు ఒక మంచి ప్రజాసేవకుడిగా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట , తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, DCMS చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మాజీ ZP Chairman CD రవి కుమార్,మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, MPP నూకల సరళ హనుమంతు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్లమోతు చైతన్య, వింజం శ్రీధర్, ముక్కపాటి వెంకటేశ్వర రావు, గుడిపాటి సైదులు బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, సర్పంచు లు, ఎంపీటీసీ లు, PACS చైర్మన్ లు, మరియు BRS పార్టీ కౌన్సిలర్స్, మాజీ సర్పంచ్ లు, కౌన్సిలర్స్, BRS పార్టీ శ్రేణులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.