హుజూర్నగర్ కేకే మీడియా మార్చి 1
హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం నాడు వైయస్సార్ తెలంగాణ పార్టీ లో భారీ చేరికలు జరిగాయి. ఆనాడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవను గుర్తుంచుకొని రానున్న రోజుల్లో వైయస్సార్ కూతురు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రంలో స్థాపించిన పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయన్న ఉద్దేశంతో హుజూర్నగర్ పట్టణానికి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు జులేపల్లి వెంకటేశ్వర్లు హుజూర్నగర్ మండలపార్టీ అధ్యక్షుడు మరి రవీందర్ రెడ్డి హుజూర్నగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రవి ల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగిన అనంతరం
ముఖ్యఅతిథిగా వచ్చిన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ జల్లేపల్లి వెంకటేశ్వర్లు JVR హుజూర్నగర్ మండల అధ్యక్షులు మర్రి రవీందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు కామిశెట్టి రవి ఆధ్వర్యంలో
సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు జేవియర్ గారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన లో తెలంగాణ ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉన్నారని ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం చేస్తూ ఇష్ట రాజ్యాంగ ప్రవర్తిస్తూ రౌడీయిజం గుండాయిజం పెంచుకుంటూ పోతుందని ఏద్దేవా చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలప్రజల కోసం పక్క ఇల్లు, ఆరోగ్యశ్రీ ,ఫీజు రీయింబర్స్మెంట్, డ్వాక్రా మహిళ ,108 ,104 వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి గా ఉన్నారని గుర్తు చేశారు.