హుజూర్నగర్ కేకే మీడియా జూన్ 25:
రాష్ట్రస్థాయిలో మార్పులు చేర్పులు రాజకీయ పార్టీలలో జరుగుతున్న వేళ హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రసవత్తరంగా మారింది. ఏ నలుగురు కనిపించిన హుజూర్నగర్ నియోజకవర్గ రాజకీయ చర్చ రచ్చ రచ్చగా చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు ఏదో ఒక ఊహాగానాలు ఇక నాయకులైతే మన భవిష్యత్తు ఏంటి అన్న సందిగ్ధంతోపాటు కార్యకర్తలు తమ అభిమాన పార్టీలలో జరుగుతున్న గందరగోళం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఏంటా అని ఆలోచనలో పడిపోయారు.
యూట్యూబ్ ఆన్లైన్ సోషల్ మీడియా ప్రపంచం వచ్చేశాక స్వార్థం కోసం వారి వారి రేటింగుల కోసం ఊహాగానాల ఊహాజనిత వార్తల తో ఇటు రాజకీయంతో పాటు అటు చాలామంది కుటుంబాలకు తలనొప్పులుగా మారాయి. జరిగేది కొంత దానిని భూతద్దంలో చూపిస్తూ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో రాజకీయ వ్యవహారం భవిష్యత్తులో మన పరిస్థితి ఏంది అన్న ఆందోళనలో చోటామోటా నాయకత్వం తెగ ఆందోళన పడిపోతున్నారు.
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన ప్రస్తుతం ఎంపీగా సేవలందిస్తున్న నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు గతంలో అయితే గవర్నర్గా అవకాశం ఇస్తారని బిజెపి లోకి వెళుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ నెలాఖరులోగా టిఆర్ఎస్లోకి చేరడంతో ఎమ్మెల్సీ అవకాశం కల్పించి వెంటనే మంత్రిగా అవకాశం ఇవ్వబోతున్నట్లు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మన భవిష్యత్తు ఏంటని గ్రామస్థాయి నాయకులు నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు పార్టీ కార్యాలయాల్లోనే వారి భవిష్యత్తు కోసం చర్చించుకోవడం గమనార్హం. ఉత్తం టిఆర్ఎస్లోకి వస్తే తన వెంట వచ్చే కాంగ్రెస్ నాయకులతో మనకు ఇబ్బందులు తప్ప మన పరిస్థితి ఏంటి అని కొందరు.మాకు ఉత్తంతో పరిచయాలు సంబంధాలు ఉన్నాయి మాతో మంచిగానే ఉంటారని మరికొందరు. మాకు అసలు ఉత్తం పరిచయమే లేదు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదని మరికొందరు. ఇలా చర్చల మీద చర్చలు చేసుకుంటే. కాంగ్రెస్ నేతలు మాత్రం కొందరు తమ తోటి నాయకులతో మన నాయకుడు పై ఇలాంటి ప్రచారం జరుగుతుంది నిజమేనా వాస్తవాలు నాయకుడు చెప్పట్లేదు అతను వెళ్ళినా మనం పార్టీలోనే ఉందాం అన్న చర్చ కూడా జరిగింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఒకరు , టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఒకరు తనపై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారని తను పదేపదే హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతున్న ఓడించేందుకు కొందరు కుట్ర పన్ని ప్రత్యర్థులకు భారీగా ఆర్థిక సహాయం చేసేందుకు ఒక రాష్ట్ర నాయకుడు ముందుకు వచ్చినట్లు తనకు తెలవకుండా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గంలలో రాజకీయ మార్పులు చేర్పులు హామీలు ఇస్తున్నట్లుగా వచ్చిన వార్తలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఎలాంటి పనికిరాని పుకార్లను నమ్మవద్దని సన్నిహితుల వద్ద తెలుపుతున్నట్లు సమాచారం.
కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కొందరు అత్యంత సన్నిహితులమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు మాత్రం నిజమో అబద్దమో తెలియదు కానీ పార్టీ మారితే ఎలా ఉంటుందన్న చర్చ చేసినట్లుగా వారి సన్నిహితులకు తెలపడంతో ఆ నోట ఈ నోట పుకార్లు షికార్లు గుప్పుమని మా దగ్గర వాడు చెప్పాడు మా బంధువు చెప్పాడు మా గురువు చెప్పాడు ఇలా రకరకాల వారు చెప్పారంటూ పుకార్లకు షికారులు అవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ ప్రచారం అంతా ఎంపీ ఉత్తమ్ కి మాత్రం తీవ్ర తలనొప్పిగా మారాయి.
ఇక అధికార పార్టీలో హుజూర్నగర్ బై ఎలక్షన్ లో ఘనవిజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సర్వేలలో తనకు టికెట్ రావట్లేదని అందుకే ప్రత్యామ్నాయంగా బిజెపి పార్టీతో హామీ తీసుకున్నారు అని పుకార్లు షికార్లు కాగా ఇవన్నీ ఏమీ పట్టించుకోనట్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామ గ్రామాన కలియ తిరుగుతూ మళ్లీ మనమే గెలిచేదంటూ నాయకులకు కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నియోజకవర్గ నాయకుల్లో ఉన్న అసంతృప్తి, నిజంగా ఉత్తమ్ కి అవకాశం ఇస్తే భవిష్యత్తుపై ఇటు బిజెపి అటు కాంగ్రెస్తో చర్చలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఇలాంటి చర్చల నడుమ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు మాత్రం తీవ్ర గందరగోళంలో పడిపోయారు . సోషల్ మీడియా వేదికగా వాట్సప్లో ఫేస్బుక్లో ట్విట్టర్ ఇన్స్టా వేదికలుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు మెసేజ్లు పెంచారు.
పార్టీలు మారి ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న కొందరికి మాత్రం ఈ పుకార్లన్నీ గొంతులో పడ్డ వెలక్కాయ మాదిరిగా వారి పరిస్థితి తయారైంది.
నిజానికి ఎంపీ ఉత్తమ్ రాష్ట్రస్థాయి నాయకుడు కాదని జాతీయస్థాయిలో తనకంటూ ఒక ఇమేజ్ ఉందని జాతీయస్థాయి నాయకత్వం నుంచి రాష్ట్రస్థాయికి తన ఇమేజ్ ని తగ్గించుకోరని ఈ ఊహాగానాలన్నీ ఊహాజనితమైన వార్తలుగానే మిగిలిపోతాయని. పోటీ చేసేది ఎంపీగా నా ఎమ్మెల్యేగా అనేదే ఒక్క సందిగ్ధం తప్ప కాంగ్రెస్ పార్టీని విడరని ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే తనకు నచ్చిన నాయకుడిని పోటీ చేయించేలా చూస్తారని . ఇక బిఆర్ఎస్ స్థానం సైదిరెడ్డి కే అని ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు