హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 15
రాజకీయాలంటేనే రొచ్చు రణరంగం అనుకుంటున్న వేళ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ పరాభవం కాంగ్రెస్ పార్టీ విజయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అలజడి మొదలైంది.
ఎన్నికల సమయంలో ఎట్టులకు పై ఎత్తులు వేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు అధికారం మారడంతో తమ పార్టీ అభ్యర్థుల ప్రాబల్యం కోసం అవసరం ఉన్నచోట్ల అధికారం బలం ,వచ్చిన చోట అవిశ్వాస తీర్మానాలకు తెరలేపారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, సింగిల్ విండోలు ఇతర రాజకీయ పరోక్ష పద్ధతిలో ఉన్న అన్ని ఎన్నికలకు ప్రస్తుత అధికారంలో ఉన్న నాయకులు మార్పులు చేసేందుకు పావులు కదుపుతున్నారు.
అధికారం ఉన్నన్ని రోజులు అధికార పార్టీలో ఉన్న బి ర్ యస్ అధికారం చేజెక్కించుకోగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యంలో జరిగిన పరిణామాల్లో ఆయా స్థానాల్లో ఉన్న అవకాశాలను బట్టి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి రాజకీయ మార్పునకు పూనుకుంటున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సమయం సంవత్సరమే ఉన్నప్పటికీ మార్పులతో తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.