భారీ ఆపరేషన్.. 1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు!
Apr 24, 2025,
భారీ ఆపరేషన్.. 1000 మంది మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు!
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. బీజాపుర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు సమాచారం. ఇప్పటికే ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

