నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 10
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నేరేడుచర్ల వాసవీ మరియు వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా స్థానిక వృద్ధాశ్రమంలోని నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు.గోమాతకు పూజలు నిర్వహించి , బహిరంగ ప్రదేశాలలో పక్షులు వేసవి తాపాన్ని తట్టుకునేలా గింజలు నీళ్లు ఉంచారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.
మరో నిరుపేదకు 5 కేజీల బియ్యం తో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.ఆయా కార్యక్రమాలలో వాసవి క్లబ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గరిణె అరుణ , డిస్ట్రిక్ట్ ఇంచార్జి కంది బండ వాసంతి , వాసవీ మరియు వనితా క్లబ్ అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ , వీరవెల్లి శ్రీలతా కోటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సంధ్య , కోశాధికారులు యీగా భాగ్యలక్ష్మి , పోలిశెట్టి అశోక్ సభ్యులు వీరవల్లి కోటేశ్వరరావు , జి వాసు తదితరులు పాల్గొన్నారు.