హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 26
మానవజాతి మనుగడ లో వృక్షాలు ఒక భాగమే అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం నాడు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి. ఎమ్మెల్యే మొక్కలు నాటిన
అనంతరం మాట్లాడుతూ.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని వక ఉద్యమంలా గత 8 సంవత్సరాలుగా నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని అన్నారు.మొక్కలు నాటడమే కాదు నాటినీ సంరక్షించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుందన్నారు..సుమారు తెలంగాణ రాష్ట్ర ఏర్పటు తర్వాత ఎన్నో కోట్ల మొక్కల్ని నాటడం నాటిన ప్రతి మొక్క కూడా నేడు పచ్చదనంతో గ్రామాలకు స్వాగతం పలుకుతోందని..హరిత విప్లవానికి నాందిగా తెలంగాణ రాష్ట్రం నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడంలో కూడా అధికారుల పాత్ర అభినందనీయమని అన్నారు..ఇకపై కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా పెట్టుకోవాలని అధికారులు వాటిని పర్యవేక్షించాలని లేనట్లయితే అధికారులపై కూడా అదే స్థాయిలో చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని అన్నారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి.. వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు..
మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వరరావు.. టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి,,
ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్.. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు