హైదరాబాద్ కేకే మీడియా జనవరి 4
హైవే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ హయత్ నగర్ నుంచి ఆటోనగర్ వరకు జరుగుతున్న విస్తరణ పనులు ఆలస్యం అవుతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్కు వచ్చే సమయం కన్నా ట్రాఫిక్ జాములతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
మిర్యాలగూడ నుండి హైదరాబాద్ రెండు గంటల్లో ప్రయాణం జరుగుతున్నప్పటికీ హయత్ నగర్ నుండి ఎల్బీనగర్కు రావడానికి గంట సమయం పడుతుంది ఆవేదన చెందుతున్నారు.
రాజధానికి పలు ప్రాంతాల నుంచి నిత్య వాహనాలు రద్దీ ఉన్న కారణంగా పనులను త్వరితగతిన చేసి అందుబాటులోకి తీసుకొచ్చి వాహదారులకు ఇబ్బంది జరగకుండా చూడాలని కోరుతున్నారు