నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులవృత్తిదారుల అభ్యున్నతి కోసం ఆర్థిక సహకారం అందించేందుకు సబ్సిడీతో ఇస్తున్న లక్ష రూపాయల బీసీ బందు పథకానికి మండల విశ్వబ్రాహ్మణులను ఒకరిని ఎంపిక చేయకపోవడం అన్యాయమని విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు తునికి పాటి మల్లాచారి ధ్వజమెత్తారు.
శనివారం నాడు నేరేడుచర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులందరూ ఎక్కువ శాతం వడ్రంగి పనితో జీవనం సాగిస్తున్నారని ఎందరో నిరుపేదలు ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకులు మాత్రం వారి చుట్టూ ఉండే కొందరికే ప్రాధాన్యత ఇస్తూ బీసీ బందులో విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించక పోవడం కక్షపూరితంగా కనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్ష పాతంగా అర్హులైన పేద బీసీ వర్గాలకు అందిస్తున్న బీసీ బందును ఇలా వారి అనుచరులకు కొన్ని వర్గాల కు మాత్రమే అందించడం తీవ్రంగా పరిగణిస్తున్నామని రానున్న ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణుల ఓట్లు అవసరం లేదా వివక్ష చూపుతున్న నాయకులకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలోమండ్రోజు సతీష్ చారి,
తుంగతుర్తి జానకి రామాచారి,సూరోజు వెంకటేశ్వర్లు,
లింగాచారి,సురేంద్ర చారి,బ్రహ్మచారి,శోభన్ బాబు,పుల్లాచారి,
కొడకండ్ల శివకృష్ణ చారి,శేఖర్,వంశీకృష్ణ,
వేణు, వెంకటాచారి,శీను ,సైదాచారి
శంకరాచారి, పవన్ చారి, నాగచారి
తదితరులు పాల్గొన్నారు…