నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 12
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద అని లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ బట్టు మధు అన్నారు. శుక్రవారం వివేకానంద 161వ జయంతి పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లా ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతు తన మాటలతో ప్రపంచ దేశాలను మెప్పించి యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తన ప్రసంగాలు రచనలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని ఎందరో వివేకానందుని స్ఫూర్తితో ఉన్నత శిఖరాల అధిరోహించారని అన్నారు. యువత భవిష్యత్తు లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడితే ఎంతటి లక్ష్యానైనా సాధించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ మాధవి, లైన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు సుంకర క్రాంతి కుమార్, లయన్స్ సభ్యులు కర్రీ సూరిబాబు, శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి జిలకర రామస్వామి, రంగారెడ్డి, శ్రీకాంత్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు