హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 24
ప్రతి వీధిలో వినియోగదారుడే రారాజు మనము వెచ్చించే ప్రతి రూపాయికి సరైన ప్రతిఫలం పొందటమే వినియోగదారుల ఉద్యమ లక్ష్యం ప్రమాదకరమైన టువంటి వస్తువులు సేవల నుండి రక్షణ పొందే హక్కు వినియోగ దారుడు తమకు కావలసిన సరుకుల,సేవల సమాచారం పొందే హక్కు, వినియోగదారుడు తమకు కావలసిన సరుకులు,సేవలను ఎంపిక చేసుకునే హక్కు,వినియోగ దారుడు తమ యొక్క ఆసక్తిని తెలియ పరచుకునే హక్కు వినియోగదారుడికి సర్కులలో సేవలలో కష్టము నష్టము జరిగిన వినియోగదారుడు నష్టపరిహారం పొందే హక్కు వినియోగదారుడు వినియోగదారుల హక్కుల పై అవగాహన పెంపొందించుకునే హక్కు ఈ హక్కులపైనే వినియోగదారులను వివేకవంతు లను చేయడం వినియోగదారుల ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం, ప్రతి సంవత్సరం 1987 నుండి జాతీయ వినియోగ దారుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వినియోగ దారుడు ఎదుర్కొనేటువంటి ముఖ్యమైన సమస్యలపై ఒక నినాదం రూపొందించడం జరుగుతుంది ఈ సంవత్సరం వినియోగదారుల ఉద్యమ నినాదం “ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తక శకంలో వినియోగదారు రక్షణ” అనే అంశంపై జరుగునున్న ప్రపంచ మార్కెట్ మొత్తం అరిచేతిలో ఇమిడి ఉన్న ఈ తరుణంలో ప్రపంచంలోని ఏ మారుమూల నుంచి అయిన వినియోగదారుడు సునాయాసంగా కొనుగోలు చేయడం డిజిటల్ లావాదేవీలు చేయడంలో వినియోగదారులు కొన్ని కష్ట నష్టాలకు గురి అవుతున్నారు, ఇటువంటి తరుణంలో వినియోగ దారులకు రక్షణ కల్పించడం, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ముఖ్య ఉద్దేశం, నానాటికి పెరిగిపోతున్న మోసపూరిత ప్రకటనలు నాసిరకం సేవలు నాసిరకం సరుకులు కల్తీలు విపని వీధిలో విలయతాండవం చేస్తున్న తరుణంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 వినియోగ దారుల పాలిట పశు పాత్రంగా ఉంది.అక్రమ పద్ధతిలో లావాదేవీలు ఈ చట్టం నిరోధిస్తుంది, ఆన్లైన్ అమ్మకాలు టెలి షాపింగ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రత్యక్ష పరోక్ష అమ్మకాలు క్రయ విక్రయాలు డిజిటల్ లావాదేవీలు మోసపూరిత ప్రకటనలు చేసే సెలబ్రిటీస్ పైన భారీగా జుర్మానాలు విధిస్తూ జైలు శిక్ష కూడా విధించే అవకాశం కల్పించింది,గతంలో వినియోగ దారుల ఫోరములుగా పిలువబడే కన్జ్యూమర్ ఫోరం లను కన్జ్యూమర్ కమిషన గా మార్చడం జరిగినది జిల్లాలలో డిస్టిక్ కన్జ్యూమర్ రెడ్ రసల్ కమిషన్లుగా పిలువబడుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో స్టేట్ కన్జ్యూమర్ రెడ్ రసల్ కమిషన్లుగా పిలువబడు తున్నాయి,జాతీయస్థాయిలో నేషనల్ కన్స్యూమర్ రెడ్ర సెల్ కమిషన్లుగా పిలువబడుతున్నాయి 2019 చట్టం ప్రకారం వినియోగదారులు ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు నమోదు చేసే అవకాశాన్ని కల్పించింది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో కన్జ్యూమర్ హెల్ప్లైన్ 1915 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో రాష్ట్ర కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జిల్లాస్థాయిలో జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది వినియోగదారుల భద్రత కోసం జాతీయస్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ చట్టంపై మా తెలంగాణ రాష్ట్ర వినియోగ దారుల సంఘాల సమాఖ్య విశేషంగా కృషి చేస్తుంది,మా వినియోగదారుల సంఘాల సమైక్య తెలంగాణలోని ఆరు డివిజన్లలో ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రతి జిల్లాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు జిల్లాలో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ నందు మా ప్రతినిధులు వినియోగ దారులకు తగు సమాచారాన్ని అందజేస్తూ ఉన్నారు మా సమస్త బిఐఎస్, ఐఎస్ఐ,హాల్ మార్క్,ఎఫ్ ఎస్ఎస్ఏఐ, అగ్ మార్క్,సిల్క్ మార్క్,రేరా లాంటి సంస్థలతో సత్సంబంధాలు పెంచుకుంటూ వినియోగ దారుల ఉద్యమానికి వినియోగదారులను చైతన్య పరచడం కోసం కృషి చేస్తూ ఉంది.