విద్యుత్ షాక్ తో వ్యవసాయ కూలీ మృతి
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే టీవీ డిసెంబర్ 29
నేరేడుచర్ల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన గజానబోయిన సైదులు గౌడ్(39) శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం కల్లూరు రెవిన్యూ పరిధిలోగల పొలం వద్ద పొలం కరికట్టు చేసే క్రమం లో కరెంట్ మోటార్ స్టార్టర్ వైర్ తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయినట్లు నేరేడుచర్ల ఎస్ఐ పరమేష్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.కూతురికి వివాహం అయినది. కుమారుడు 10 వ తరగతి చదువుతున్నాడు. భార్య సరిత ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.