నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 21:
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు అందించిన స్టడీ మెటీరియల్ ను క్రాంతి నికేతన్ సంస్థ చైర్మన్ సుంకర క్రాంతి కుమార్ మంగళవారం నాడు అందజేశారు.
పెంచికల్ దిన్నే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు, సోమవారం, మేడారం పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల ఏజీఎం దొంతి రెడ్డి కరుణాకర్ రెడ్డి సహకరించిన పదవ తరగతి అన్ని సబ్జెక్టుల ఆబ్జెక్టివ్ తో కూడిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందజేసి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆశీర్వదించారు
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక బృందం పాల్గొన్నారు