సూర్యాపేట కేకే మీడియా జూన్23: సకల సౌకర్యాలతో… అత్యాధునిక హంగులతో.. గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల
రూ.4.20 కోట్లతో మూడున్నర ఎకరాల్లో కార్పొరేట్ ను తలదన్నేలా నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది .
అదనంగా మరో 5కోట్లు మంజూరు చేయించి సూర్యాపేట పట్టణంలో
మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ప్రారంభం కానున్న అదనపు నిర్మాణాలు
మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి అతి త్వరలో జాతికి అంకితం ఇవ్వనున్న మంత్రి జగదీష్ రెడ్డి పాఠశాల భవనాన్ని పరిశీలించిన జగదీష్ రెడ్డి.
ఫెన్సింగ్ నిర్మాణం, డైనింగ్ హాల్ లను మార్పు చేయాలంటూ ఆదేశం
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి వెంట సువిశాల స్థలంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్పొరేట్ బిల్డింగ్‌ను తలపిస్తున్న నిరుపేద గిరిజన విద్యార్థినులకు బోధన అందించనున్న గురుకులం ప్రారంభానికి సిద్ధమైంది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఐలాపురం వద్ద మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో 4 కోట్ల 20 లక్షల రూపాయలతో రూపుదిద్దుకున్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలకు మరిన్ని నిధులు మం మంజూరు అయ్యాయి. త్వరలో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ప్రారంభించనున్న స్కూల్ భవనాన్ని నేడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరిశీలించారు. త్వరలో త్వరలో ప్రారంభం కానున్నాయి స్కూల్ భవనానికి సంబంధించి ఫెన్సింగ్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా డైనింగ్ హాల్ కిచెన్ లను మార్పు చేయాలని సూచించారు. హైవే నుండి స్కూల్ కి వెళ్లే దారి ఆధునికరించే పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు సూర్యాపేట-ఖమ్మం నూతన జాతీయ రహదారి పక్కన ఐలాపురం వద్ద విశాలమైన స్థలంలో నిర్మాణమై ఆకర్షణీయంగా కనిపిస్తున్న మూడంతస్తుల భారీ భవంతి చివ్వెంల మండలానికే ఓ ఐకాన్‌లా కనిపిస్తుంది. అదేదో కార్పొరేట్ కంపెనీలకు చెందిన భవనమో.. వందలాది బ్రాంచీలు కలిగిన విద్యాసంస్థో అనుకుంటే పొరపాటే. కార్పొరేట్‌ను తలదన్నేలా నిర్మాణం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆ భవనం సర్కారు గిరిజన గురుకుల పాఠశాల. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.4.20 కోట్లు వెచ్చించి సకల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవనం త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల ఆ భవనాన్ని చూసి విద్యార్థినులు పట్టలేని సంతోషంతో ఉన్నారు.
పురాతన భవనాలు.. ఊడిపోతున్న పైకప్పు పెచ్చులు.. విరిగిన బెంచీలు.. కనిపించని ప్రహరీలు.. మరుగుదొడ్లు లేక ఆడపిల్లల కష్టాలు.. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సర్వసాధారణంగా కనిపించేవి. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సర్కారు బడుల్లో పరిస్థితులు మారిపోయాయి. వసతులు మెరుగుపడ్డాయి. మండలానికో అత్యాధునిక భవనాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలతో పాటు ఉద్యోగార్థుల కోసం అవసరమున్న చోట కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులకు సన్న బియ్యం, వెజ్, నాన్‌వెజ్‌తో పౌష్టికాహారం అందిస్తున్నది. ఇప్పుడు పాఠశాల భవనాలను కార్పొరేట్ కార్యాలయాన్ని తలదన్నేలా అధునాతనంగా నిర్మిస్తున్నది. సకల సౌకర్యాలు కల్పిస్తున్నది.గిరిజన గురుకులం ప్రత్యేకతలు
3.5 ఎకరాల్లో రూ.4.20 కోట్ల వ్యయంతో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. ఒక్కో ఫ్లోర్‌కు 7200 చదరపు అడుగుల చొప్పున మొత్తం 28,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 28 తరగతి గదులు నిర్మించారు. 640 మంది విద్యార్థినులు సౌకర్యవంతంగా చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. తరగతి గదులతోపాటు సువిశాలమైన క్రీడా స్థలం, సైన్స్ ల్యాబ్, 60 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు, తాగునీటి వసతి, డైనింగ్ హాల్, అధునాతన మరుగుదొడ్లు నిర్మించారు. భవన నిర్మాణం దాదాపు పూర్తి అయింది. సకల సౌకర్యాలతో నిర్మించిన తమ బడిని చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.