నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 10
విద్యతో జీవితంలో విజయం సాధించవచ్చు అని క్రాంతినికేతన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పెంచికలదిన్నె మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అన్నారు. గురువారం నాడు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు వారి తాతగారైన అరిబండి లక్ష్మీనారాయణ 25వ వర్ధంతి సందర్భంగా నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందజేశారు.
అరిబండికి విద్యా అన్న ,విద్యార్థులు అన్న ఎంతో ఇష్టమని ఆయన ఆశ సాధనలో మనవడిగా 2002 నుండి విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నేరేడుచర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు లక్ష్మీనారాయణ కారణమని అన్నారు . విద్యాపరంగా ఏ అవసరం వచ్చినా సంస్థను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మర్రి నాగేశ్వరరావు, కొప్పు రామకృష్ణ గౌడ్, కాసాని నాగరాజు, తదితరులు పాల్గొన్నారు