కేకే మీడియా ఏపీ ఆగస్టు 31
బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంగా రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురిస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీగా వర్షం కురుస్తుండటంతో పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్షానికి గాలి కూడా తోడుకోవడంతో కొన్నిచోట్ల చెట్లు కూలిపోయాయి. చిన్నిపాటి పూరిగుడెసులు నేలమట్టం అవుతున్నాయి. నగరాల్లో అయితే జనజీవనం స్తంభించింది. విధులకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులన్నీ మోకాలు లోతు నీటితో నిండిపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ స్తంభించడంతో రహదారులపై వాహనాలు బారులు తీరాయి. విజయవాడ -గుంటూరు జాతీయ రహదారిలోని టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ప్రత్యేకంగా అక్కడ విధులు నిర్వహించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
విజయవాడలోని కొండ ప్రాంతాల్లో పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది. మొగల్రాజపురం కొండలపైనున్న బండరాళ్లు జనం ప్రాణాలను బలిగొంటున్నాయి. శనివారం ఉదయం మెగల్ రాజపురంలో కొండచరియలు విరిగిన ఘటనలో సున్నపుబట్టీల సెంటర్ కు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
_ప్రజల తరలింపు_
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తుచేయాలని అధికారులకు సీఎం సూచించారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పకపాటించాలని ఆయన కోరారు.
విజయవాడలో కొండచరియలు విరిగిపడి 4 గురు మృతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
RELATED ARTICLES