హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 15;
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తుక్కు గూడెం లో జరిగే విజయభేరి సభను విజయవంతం చేయాలని నల్లగొండ పార్లమెంటు సభ్యులు నలమాల ఉత్తంకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు
శుక్రవారం హుజూర్నగర్ లో ఉత్తమ పద్మావతి దంపతుల నూతన గృహప్రవేశ సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ను ఆహ్వానించి కార్యక్రమ అనంతరం ఏర్పాటుచేసిన వరుస సన్నాహక సమావేశంలో ఎంపీ ఉత్తమ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దేశంలోనే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నంబర్ 1 స్థానంలో నిలిచినట్లే, 17వ తేదీన జరిగే సభకు జనసమీకరణలో నంబర్ 1గా నిలవాలన్నారు.
డిసెంబర్‌లో జరిగే మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం రాహుల్ గాంధీని భారతదేశానికి తదుపరి ప్రధానిగా చేయడానికి ఈ ఎన్నికలు మొదటి అడుగు అని MP ఉత్తం అన్నారు.
17న జరిగే సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని అదే ఉత్సాహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఉత్తం సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి తో పాటు ఎంపీపీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు