వాసవి, వనితా క్లబ్ ల జోన్ చైర్మన్లు గా లక్ష్మణ్ , శ్రీలత
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే టీవీ జనవరి 1
వాసవి, వనితా క్లబ్ జోన్ చైర్మన్లు గా నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొత్త లక్ష్మణ్, వీరవల్లి శ్రీలతా కోటేశ్వరరావుల ను నియమించారు.వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ సోమవారం వీరికి నియామక పత్రాలు అందజేశారు. సూర్యాపేటలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జోన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తా లక్ష్మణ్, వీరవల్లి శ్రీలత కోటేశ్వరరావు నేరేడుచర్ల వాసవి, వనితా క్లబ్ ల అధ్యక్షులుగా 2023 సంవత్సరంలో విశేష రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన జోన్ చైర్మన్లు మాట్లాడుతూ నేరేడుచర్ల వాసవి,వనితా క్లబ్బుల నూతన కార్యవర్గానికి, చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ నేరేడుచర్ల క్లబ్ కు మరోసారి ఇంటర్నేషనల్ అవార్డు లభించేలా కృషి చేస్తామని అన్నారు. వీరి నియామకం పట్ల నేరేడుచర్ల వాసవీ , వనితా క్లబ్, మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.