నేరేడుచర్ల కేకే మీడియా
నేరేడుచర్ల లోవనితా క్లబ్బుల ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పున్న నాగిని, స్థానిక వైద్యురాలు స్వప్న,చార్టెడ్ అకౌంటెంట్ సాయి వినీతలను శాలువాలు,పూలమాలలు, జ్ఞాపకలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వైస్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి, జోన్ చైర్మన్లు కొత్త లక్ష్మణ్,వీరవల్లి శ్రీలత, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరు శ్రీనివాస్, కోశాధికారి జూలూరు అశోక్, వనిత క్లబ్ ప్రధాన కార్యదర్శి చెరుకు కవిత, సోమప్ప ఆలయ కమిటీ చైర్మన్ చిత్తనూరి సత్యనారాయణ, మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాసరావు,పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కందిబండ వాసంతి, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు గొళ్ల సుధాకర్,కందిబండ శ్రీనివాసరావు,ఊట్కూరు నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.