వాసవి, వనితా క్లబ్బుల ఆధ్వర్యంలో
గాంధీ విగ్రహావిష్కరణ
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే టీవీ27
దేశ స్వాతంత్రం కొరకు అసువులు బాసిన అనేకమంది మహనీయుల జీవిత చరిత్రలను నేటితరం విద్యార్థులకు అవగాహన కలిగించేలా ఉపాధ్యాయులు బోధించాలని వాసవి క్లబ్ గవర్నర్ వంగవీటి వెంకట గురుమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు.బుధవారం నేరేడుచర్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వాసవి,వనితా క్లబ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. నిరుపేద విద్యార్థిని, విద్యార్థుల విద్యాభివృద్ధికి వాసవి క్లబ్ సహకారం అందిస్తుందన్నారు. పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల సౌకర్యార్థం స్టడీ చైర్ లను అందజేస్తామన్నారు. అలాగే పదవ తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులకు వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాసరావు రూ.2 వేలు, క్లబ్బు ఆధ్వర్యంలో సిల్వర్ కాయిన్ లు ప్రోత్సాహంగా అందిస్తామని ప్రకటించారు. గాంధీజీ విగ్రహావిష్కరణ అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐపిసి గరిణె అరుణకుమారి, డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ రాచకొండ శ్రీనివాస రావు, వాసవి,వనితా క్లబ్ అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్, వీరవల్లి శ్రీలతా కోటేశ్వరరావు, సెక్రటరీలు గజ్జల కోటేశ్వరరావు, పోలిశెట్టి సంధ్య , సభ్యులు ఊటుకూరు నటరాజు, పాల్వాయి గోపాలకృష్ణ, పోతుగంటి సత్యనారాయణ, నీలా రామ్మూర్తి, ప్రసాద్,రాచకొండ నాగలక్ష్మి, మాశెట్టి సైదయ్య, తడకమళ్ళ పరమేశం, మురారి శెట్టి రమేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒగ్గు రమేష్, ఉపాధ్యాయులు వై. నరసకుమారి, చల్ల ప్రభాకర్ రెడ్డి, కురువెల్ల శ్రీనివాసరావు, విజయ,అన్నపూర్ణ,భూదేవమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.