నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 20:
మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని దిర్శించర్ల గ్రామంలో దిర్శించర్ల వాలీబాల్ యూత్ ఆధ్వర్యంలో ఈనెల 18 19 20 తేదీలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు గత మూడు రోజులుగా జరిగే హోరాహోరీ పోటీలలో గెలుపొందిన. ప్రథమ బహుమతి వరంగల్ జట్టు కు 25 వేల రూపాయలు నగదుతోపాటు షీల్డ్, ద్వితీయ బహుమతి వెంకటేశ్ టీం. 20 వేల రూపాయల నగదు తో పాటు షీల్డ్, తృతీయ బహుమతి నందిపాటి కిరణ్ టీం 15,116లు నగదు తో పాటు షీల్డ్, చతుర్ధ బహుమతి త్రిపురారం టీం పదివేల రూపాయలు నగదు తో పాటు షీల్డు అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలకు మండల వైస్ ఎంపీపీ తాలూరి లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కర్నే. నాగిరెడ్డి ఎలీషా, కర్ణం పాండయ్య, ఆకుల జగతయ్య, మిడతలపల్లి శ్రీనివాస్, కుంటి గొర్ల లింగయ్య పాల్గొనగా ఎంపైర్లుగా సీతారాం రెడ్డి ముక్కంటి యాదగిరి విజయ్ రెడ్డి వ్యాఖ్యతగా పి వెంకటేశ్వర్లు వ్యవహరించగా ఈ టోర్నమెంట్లో మొత్తం 44 జట్లు పాల్గొన్నాయి.