Sunday, May 18, 2025
HomeNational*వాట్సాప్ దొంగలు..

*వాట్సాప్ దొంగలు..

*కోడ్ షేర్ చేస్తే అకౌంట్ అంతే..*

*స్నేహితులు, బంధువులనూ ట్రాప్ చేస్తారు…*

చాలా మంది భారతీయులు వాట్సాప్ను పలు రకాలుగా వాడుతున్నారు. అది వారి జీవితాలతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. ఎప్పుడైనా కొద్దిసేపు వాట్సాప్ పనిచేయ కపోతే…? కొంపలు మునిగిపో యాయని ఆందోళన చెందుతారు. ఆనందాలు, బాధలు, సుఖాలు, ద్ణుఖాలు, మీమ్స్…ఇలా ఎన్నింటినో కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచు కోవడానికి ఇదో మాధ్యమంగా మారింది. ముచ్చట్లకు, సమాచారాన్ని చేరవేయడానికి, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి వాట్సాప్ను మించిన మాధ్యమం మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి మాధ్యమంలోకి ఓ చొరబాటుదారుడు ప్రవేశించి మీ వ్యక్తిగత ఛాటింగ్స్ను, అనుభవాలను, సంబంధాలను దొంగిలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి.

*హ్యాకింగ్ ఇలా…*

ఇదేదో ఊహాజనిత పరిస్థితో, పీడకలో కాదు. ఇది వాస్తవం. వాట్సాప్ను హ్యాకింగ్ చేస్తున్న కేసులు ఇటీవలి కాలంలో దేశంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇదెలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? మీరు వాట్సప్లో లీనమవుతున్న సమయంలో ఓ నోటిఫికేషన్ వస్తుంది. అది మీ దీర్ఘకాల స్నేహితుడిది అయి ఉంటుంది. అతను మీకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసి ఉంటాడు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఛాట్ విండో ఓపెన్ చేస్తారు. ఉభయకుశలోపరి ముగిసిన తర్వాత మీకు ఓ సందేశం వస్తుంది. ‘నేను ఒక కొత్త ఫోన్ తీసుకున్నాను. పొరబాటున నీ ఫోన్ నెంబరుకు ఒక కోడ్(ఓటీపీ) పంపానని అనుకుంటున్నాను. దానిని నాకు తిరిగి పంపగలవా?’ అని అడుగుతాడు. మీకు ఎలాంటి సందేహమూ కలగదు కదా. ఎందుకంటే అతను మీ చిరకాల స్నేహితుడు. నమ్మకస్తుడు. అతనితో గతంలో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు పంచుకొని ఉంటారు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా మీరు ఓటీపీ పంపేస్తారు. అంతే…ఏం జరిగిందో తెలిసే లోగానే మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అవుతుంది.

*కొంపముంచే నమ్మకం..*

ఓ అమాయకపు సందేశం, నమ్మకం మీ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని దొంగిలిస్తుంది. మీ అకౌంట్ హ్యాక్ అయిన తర్వాత అది ఓ గొలుసుకట్టు మాదిరిగా సాగిపోతూనే ఉంటుంది. హ్యాకర్లు మీ అకౌంట్ను ఉపయోగించి, మీ కాంటాక్ట్ జాబితాలో ఉన్న ఇతరులను కూడా లక్ష్యంగా చేసుకుంటారు. మిమ్మల్ని ఎలా బుట్టలో వేసుకున్నారో వారిని కూడా అలాగే వేసుకుంటారు. ఒకరి తర్వాత ఒకరుగా మీ స్నేహితులు, బంధువులు, ఇతరులు వారి వలలో పడిపోతారు. ఫోన్ మార్చేటప్పుడు వాట్సాప్ మీకు ఆరు అంకెల సెటప్ కోడ్ పంపుతుంది. అదే మీ ఖాతా హైజాక్ కావడానికి దోహదపడుతుంది. ఇతర వినియోగదారులను వంచించడానికి ఉపయోగపడుతుంది. ఈ కుంభకోణం డొంకతిరుగుడుగా కాకుండా నేరుగానే జరుగుతున్నప్పటికీ చాలా మంది దీనికి బాధితులుగా మారిపోవడం గమనార్హం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ఖాతాను తిరిగి పొందలేరు. ఎందుకంటే దానిపై హ్యాకర్లకు పూర్తి ఆజమాయిషీ ఉంటుంది.
డొంకతిరుగుడుగా కాకుండా నేరుగానే జరుగుతున్నప్పటికీ చాలా మంది దీనికి బాధితులుగా మారిపోవడం గమనార్హం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ ఖాతాను తిరిగి పొందలేరు. ఎందుకంటే దానిపై హ్యాకర్లకు పూర్తి ఆజమాయిషీ ఉంటుంది.
సెలబ్రిటీలు సైతం…
మీ అకౌంట్ను హ్యాక్ చేసిన వారు మీ స్నేహితులకు కూడా సందేశాలు పంపగలరు. యూపీఐ చెల్లింపులు జరపాల్సిందిగా కోరవచ్చు. లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడగవచ్చు. ఒకవేళ జరిగిన మోసాన్ని మీరు సందేశాల ద్వారా స్నేహితులకు తెలియజేయాలని అనుకున్నప్పటికీ హ్యాకర్లు వాటిని వెంటనే తొలగిస్తారు. దేశంలో ఇలాంటి వాట్సాప్ హ్యాకింగులు ఎన్ని జరుగుతున్నాయని చెప్పడానికి అధికారిక గణాంకాలేవీ అందుబాటులో లేవు. కానీ, హ్యాకర్ల మోసానికి గురవుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. తాజాగా తన వాట్సాప్ హ్యాక్ అయిందంటూ ప్రముఖ నిర్మాత, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించారు. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దని హెచ్చరించారు.
తన ఫోన్, వాట్సప్ అకౌంట్ హ్యాక్ అయ్యాయని ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే ఆగస్టులో సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద అడ్వర్టైజింగ్ గ్రూప్ డబ్ల్యూపీపీ సీఈఓ మార్క్ రీడ్ కూడా హ్యాకింగ్ బాధితుడే.

*ఏం చేయాలంటే…*

ఫోన్ హ్యాకింగ్కు గురి కాకుండా చూసుకోవడం ఎంతో అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, మీ ఫోన్ నెంబరుకు పంపే ఆరు అంకెల కోడ్ను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ పంపకూడదు. ఎవరు, ఎందుకు, ఏ విధంగా అడిగినా స్పందించకూడదు. ఎందుకంటే ఇవన్నీ దాదాపుగా కుంభకోణాలే. మీ అకౌంట్ను హైజాక్ చేసి, దాని ద్వారా ఇతరులనూ లక్ష్యంగా చేసుకొని డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం అడుగుతారు. వాట్సాప్నకు ఉండే రెండు దశల వెరిఫికేషన్ ప్రక్రియ అదనపు భద్రతను కల్పిస్తుంది. దానిని మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వ్యక్తిగత పిన్, ఆరు అంకెల కోడ్ను మీరే ఏర్పాటు చేసుకోవాలి. మీ అకౌంట్ను కొత్త ఫోన్కు మార్చేటప్పుడు ఈ రెండూ అవసరమవుతాయి. దీనితో పాటు ఈ-మెయిల్ ఐడీని మీ అకౌంట్తో అనుసంధానించాలి. అందుబాటులో ఉన్నట్టయితే పాస్కీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ చర్యల ద్వారా హ్యాకింగ్ బరి నుంచి బయటపడవచ్చునని సైబర్ నిపుణులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments