మిర్యాలగూడ, కేకే మీడియా అక్టోబర్ 1
వస్త్ర ప్రపంచంలో రారాజు అయిన సిఎంఆర్ మిర్యాలగూడలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆదివారం సాగర్ రోడ్డులో సిఎంఆర్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర సముదాయాన్ని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యాపార సంస్థలు మిర్యాలగూడ పట్టణానికి రావడంతో పట్టణ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అన్నారు. అదేవిధంగా సిఎంఆర్ సంస్థ అధినేత మావూరి మోహన్ బాలాజీ మిర్యాలగూడ పట్టణ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి 25 లక్షలు విరాళం ఇవ్వడం హర్షణీయమన్నారు. సంస్థ అధినేత మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు తమ అభీష్టాలకు అనుగుణంగా నూతన వస్త్రాలను పరిచయం చేస్తున్నమన్నారు. షో రూమ్ ను ప్రముఖ సినీతర రాశిఖన్నా సందర్శించి ఆహ్వానితులను కొనుగోలుదారులను ఉత్తేజపరిచారు. మొదటి కొనుగోలును ప్రముఖ రైస్ మిల్లర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ కొనుగోలు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి శ్యామ్, పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు పాల్గొన్నారు