నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 26
నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపాలిటీ పరిధిలో గల రామాపురం గ్రామం నందు రోడ్డు ప్రక్కన గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదలైన ప్లాస్టిక్ వస్తువులు ఏరుకొని అమ్ముకొని , యాచించి జీవనం సాగిస్తున్న ఆవుల ముత్తయ్య మరియు ఆవుల కోటమ్మ వీరికి నేరేడుచర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు జోన్ చైర్మన్ ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి బియ్యం నిత్యవసర సరుకులు కూరగాయలను అందించనైనది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మరియు జోన్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రామాపురం రోడ్డు పక్కన నివసిస్తున్న నిరుపేదలైన వీరికి లయన్స్ క్లబ్ సేవలు అందించడం పేదలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ లైన్ జీఎస్టీ కోఆర్డినేటర్ దశరథ గారు చార్టర్ ప్రెసిడెంట్ కొనతం సీతారాం రెడ్డి క్లబ్ కార్యదర్శి జిలకర రామస్వామి క్లబ్ ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ కర్రీ సూర్యనారాయణ రెడ్డి క్లబ్ సభ్యులు జి రంగారెడ్డి వి లక్ష్మారెడ్డి ఎం సైదులు ఆర్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు