నేరేడుచర్ల కేకే మీడియా
వైద్యుల దినోత్సవం సందర్భంగా సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులైన నాగిని, సౌమ్యశ్రీ, సీతామహాలక్ష్మి,శృతి,ధర్మ తేజ,సాయి లను ఘనంగా సన్మానించారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జీలకర్ర రామస్వామి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, వారి సేవలు అత్యంత విలువైనవని కొనియాడారు. కార్యక్రమంలో డిస్టిక్ చైర్మన్ బట్టు మధు, జోనల్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి,లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి సైదిరెడ్డి, ట్రెజరీ షేక్ యూసుఫ్, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ,సూర్యనారాయణ రెడ్డి,పూర్వ అధ్యక్షుడు కందిబండ శ్రీనివాసరావు,చిత్రం విశ్వనాధ్, సిహెచ్ఓ శ్రీనివాస్ , సిబ్బంది హరి,సాగర్,సౌమ్య తదితరులు పాల్గొన్నారు.