నేరేడుచర్ల కేకే మీడియా జులై 31
నేరేడుచర్ల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం నాడు నోటు పుస్తకాలు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నోటు పుస్తకాలు అందజేయడం జరుగుతుందని భవిష్యత్తులో విద్యార్థుల అవసరాల కోసం ఏదైనా సహకారం కావాలంటే లయన్స్ క్లబ్ ను సంప్రదించాలని తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు బట్టు మధు సుంకర క్రాంతి కుమార్ సభ్యులు సూరిబాబు విశ్వనాథ్ రంగారెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు