లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా డాక్టర్లకు సన్మానం
నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 3
జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా శనివారం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టర్లు డాక్టర్ నాగిని, డాక్టర్ శృతి, డాక్టర్ సీతామహాలక్ష్మిల ను నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ బట్టు మధు మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, కరోనా కాలములో ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు వైద్య సేవలు చేశారని అన్నారు. రోగులకు డాక్టర్లు చేసే వైద్య సేవలు మరవలేనివి అని, వైద్య వృత్తిలో మహిళలు రాణించటం హర్షించదగ్గ విషయమన్నారు. నేరేడుచర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అంకితభావంతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న మహిళా డాక్టర్లను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ కొణతం సీతారాం రెడ్డి మాట్లాడుతూ మనుషులు ఆరోగ్యంగా జీవించాలంటే వైద్యుల అవసరం ఎంతో ఉందన్నారు. సామాన్యులకు వైద్యం అందటం లేదని, ప్రైవేటు వైద్యంతో వారి ఆస్తులు కరిగిపోతున్నాయని అన్నారు. ప్రతి రోగికి వైద్య సేవలు అందించాలని కోరారు. సన్మాన గ్రహీతలైన మహిళా డాక్టర్లు డాక్టర్ నాగిని, డాక్టర్ శృతి, డాక్టర్ సీతామహాలక్ష్మి లు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మమ్మల్ని సన్మానించడం గర్వంగా ఉందని, దీంతో మా బాధ్యతలు మరింత పెరిగాయని అన్నారు. అందరి సహాయ, సహకారాలతో రోగులకు వైద్య సేవలు అందించటంలో ముందు వరుసలో ఉంటామన్నారు. సన్మానించినందుకు లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీనివాస్, ఎంజెఎఫ్ లయన్స్ కట్టా శ్రీనివాస్ రెడ్డి, క్లబ్ ఉపాధ్యక్షుడు కర్రి సూర్యనారాయణ రెడ్డి ,గుండా సత్యనారాయణ, క్లబ్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, నీలా శ్రీనివాస్, మాతంగి సైదులు, యారవ సురేష్,దేవులపల్లి శంకరాచారి, హరికృష్ణ, సాగర్, శ్యామ్ సుందర్ రెడ్డి, నరసయ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.