నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 1
లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణ ప్రధాన రహదారుల వెంబడి బస్ స్టాప్ లలో ప్రయాణికుల సౌకర్యార్థం సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ బట్టు మధు, క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ, పట్టణంలో ప్రధాన రహదారుల విస్తరణ తదుపరి బస్ స్టాప్ లలో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు మహిళలు వృద్ధుల ఇబ్బందులను గమనించి లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఈ విధమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు అధ్యక్షుడు చల్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో అన్ని పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజల సౌకర్యార్థం విరివిగా సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసేందుకు క్లబ్బు సన్నద్ధమైందని ఇట్టి సౌకర్యాలను ప్రజల వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జిలకర రామస్వామి ఉపాధ్యక్షులు కర్రీ సూర్యనారాయణ రెడ్డి, గుండా సత్యనారాయణ మరియు సభ్యులు బాలన సైదులు ఎస్ కె యూసుఫ్ సూరారపు వెంకన్న గౌడ్ చిత్రం విశ్వనాధ్ గంట రంగారెడ్డి పాల్గొన్నారు