- నేరేడుచర్ల కేకే మీడియా అక్టోబర్ 2
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మహాత్ముని త్యాగాలను కొనియాడారు. నేరేడుచర్ల కు చెందిన స్వాతంత్ర సమరయోధులు పోరెడ్డి చిన్న జాన్ రెడ్డి సతీమణి వెంకటమ్మకు, పోరెడ్డి బుచ్చిరెడ్డి సతీమణి కాంతమ్మ లకు సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు చల్ల ప్రభాకర్ రెడ్డి , జూన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఎడవల్లి, డిసి భట్టు మధు,మాజీ అధ్యక్షులు కొనతం సీతారాం రెడ్డి, పో రెడ్డి శ్రీరామ్ రెడ్డి, సుంకర క్రాంతి కుమార్, కంది బండ శ్రీనివాస్, కార్యదర్శి జిలకర రామస్వామి, రామ్ రెడ్డి, రామకృష్ణ, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు