మూగజీవాలతో పొంచి ఉన్న ప్రమాదం
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 12:
గత కొన్ని రోజులుగా నేరేడుచర్ల ప్రధాన రహదారిపై గోమాతల దర్శనమిస్తున్నాయి.
గతంలో ఇలా కొన్నాళ్లపాటు కనిపించిన గోవులు మళ్లీ ప్రత్యక్షమవడం ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారుల వెంటనే తిష్ట వేయడంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది.
వాటి యజమానులు అవే తిరిగి వస్తాయిలే అన్న రీతిలో రోడ్ల వెంట వదిలి వెళ్ళడం తో రోజు ఇలా పగలు రాత్రి వేళలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రధాన రోడ్లపైనే విశ్రాంతి తీసుకుంటుండడంతో రాత్రి వేళల్లో ప్రయాణం చేసే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని , సంబంధిత అధికారులు యజమానులను పిలిపించి చర్యలు తీసుకోవాలని యజమానులు ఎవరూ లేకుంటే గోశాలలకు పంపించాలని ప్రజలు కోరుతున్నారు.