నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 28
నేరేడుచర్ల లోని జాన్పాడు రోడ్డు విస్తరణ చేయాలని మునిసిపాలిటీ భావించింది. హుజూర్నగర్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగిన అనంతరం అప్పటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్నగర్ నియోజకవర్గం లోని నేరేడుచర్ల హుజూర్నగర్ మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయడంతో మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం రోడ్డు పాత నేరేడుచర్ల రోడ్డు తో పాటు జాన్ పహాడ్ రోడ్డును విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. జాన్ పహాడ్ రోడ్డు ఆర్ అండ్ బి కి మారగా అట్టి విస్తరణ వంద అడుగులు గా నిర్ణయించి ఇరువైపులా ఉన్న దుకాణదారులకు ఆ కొలతల మేర విస్తరణ జరపాలని మున్సిపల్ అధికారులు తెలియపరిచారు. కానీ ప్రధాన రహదారి నుండి జాన్ పహాడ్ వెళ్లే దారి నేరేడుచర్ల కు వ్యాపార సముదాయ కూడలిగా దుకాణాలు విస్తరించి దుకాణదారులు వ్యాపారం చేసుకుంటున్న నేపథ్యంలో మొదటి భాగంలో ఉన్న కొంతమంది వ్యాపారులు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఆర్ అండ్ బి కి ఇంకా మారలేదని డొంకగానే ఉందని మీరు చేసే విస్తరణ కోసం మా దుకాణాలను ఎలా తొలగించుకోవాలని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారు పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మునిసిపాలిటీ మరి ఇతర నాయకులు ఎలాగైనా విస్తరణ చేపట్టాలని దుకాణ యజమానులపై ఒత్తిడి తీసుకురావడంతో 100 అడుగులకు బదులుగామొదట 66 అడుగుల వెడల్పును కొంత దూరం చేపడతామని తరువాత 100 అడుగుల మేర తీసేందుకు ప్రణాళికలు రూపొందించి వారికి కబురు చేయగా మొట్టమొదట ఉన్నవారు కొందరు మా దుకాణాలు 66 అడుగులు తీసిన కేవలం 5 6 అడుగుల మాత్రమే మిగులుతుంది మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడం రెండు మూడు పర్యాయాలు స్థానిక శాసనసభ్యులతో మాట్లాడటం ఎట్టకేలకు కొంత దూరం 330 60 అడుగులుగా మరికొంత దూరం 66 అడుగులుగా మిగిలినది వంద అడుగులుగా నిర్ణయించడం జరిగిందని తెలుస్తోంది. అందుకు ఒప్పుకున్న ముందు భాగంలో ఉన్న దుకాణాల యజమానులు కొలతలకు ఒప్పుకొని స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు కానీ మిగిలిన వారు కూడా అదే కొలతలతో మాకు ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక చివరి 550 తీసేవారు కూడా మాకు మాత్రం వెసులుబాటు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు దీంతో అసలు రోడ్డు విస్తరణ పనులు చేపడతారా లేదా చేపడితే ఏ మేరకు చేపడుతారు. ఎంత మేరకు కొలతలు ఉంచుతారు అనుకున్న లక్ష్యం నెరవేరేనా విస్తరణతో డివైడర్లు ఏర్పాటు జరుగుతాయా లేవా అని ఆలోచనలు ఉన్నాయి