నేరేడుచర్ల కేకే మీడియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కి అర్హతగా తెల్ల రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన సరైనది కాదని తెలంగాణ రైతు సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అన్నారు.
సోమవారం పత్రికా ప్రకటనలు తెలియజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో రైతులందరికీ ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న కొందరికి రేషన్ కార్డులు రాలేదని, కొందరు ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం ఇష్టం లేక తీసుకోలేదని అంతమాత్రాన వారు రైతులు కాకుండా పోతారా, లేక కోటీశ్వరులవుతారా అని ప్రశ్నించారు. ఇప్పటికే 2023 ఖరీఫ్ ,రబి పంటల పండగ అప్పుల పాలు అయిన రైతన్న కు ఈ రకమైన ఆంక్షలు తీవ్ర ఆవేదన గురిచేస్తాయని. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.